AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’..

  • యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’
  • ముద్దం నరసింహస్వామి రచనపై ప్రముఖ రచయిత అభినందనల లేఖ

హైదరాబాద్: నక్షత్రం ప్రచురణల తొలి పుస్తకంగా వెలువడిన రచయిత, సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రచించిన ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’ పుస్తకంపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ప్రశంసలు కురిపించారు. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన ఆయన, తన అభిప్రాయాలను ప్రత్యేక లేఖ ద్వారా రచయితకు తెలియజేశారు.

ఈ రోజుల్లో సినిమా రంగంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నవారికి సైతం తెలియని అనేక కొత్త విషయాలను ఈ పుస్తకంలో వివరించారని యండమూరి పేర్కొన్నారు. రచయితలు, దర్శకులు, నిర్మాతలతోపాటు విద్యార్థులు, విజువల్ క్రియేటర్లకు కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. సినిమా నిర్మాణాన్ని మరింత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో ఎలా చేపట్టవచ్చో తెలియజేసే అనేక ఆచరణాత్మక సూచనలు ఇందులో ఉన్నాయని ప్రశంసించారు.

సినిమా రంగం నుంచి విశ్రాంతి తీసుకున్న తనలాంటి వారికే ఈ పుస్తకం ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని, ప్రస్తుతం సినీ పరిశ్రమలో పనిచేస్తున్నవారికి, కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని యండమూరి తన లేఖలో పేర్కొన్నారు. రచయిత తన అనుభవంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.

డిజిటల్ యుగంలో పుస్తక పఠనం తగ్గుతున్నప్పటికీ, నూతన అంశాలతో కూడిన పుస్తకాలకు ఆదరణ ఉంటుందని నక్షత్రం ప్రచురణల ప్రతినిధులు పేర్కొన్నారు. తమ ప్రచురణ సంస్థ నుంచి వెలువడిన తొలి పుస్తకానికే యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖ రచయిత నుంచి ప్రశంసలు లభించడం ఆనందంగా ఉందన్నారు. యండమూరి ప్రశంసలు తనకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయని రచయిత ముద్దం నరసింహస్వామి తెలిపారు.

ANN TOP 10