AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ కళ్యాణ్ ‘ఓజి 2’పై మైండ్ బ్లోయింగ్ లీక్..!

వచ్చేసింది …పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులని తిరగరాసిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’ (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) సీక్వెల్‌పై టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం మొదలైంది. సుజీత్ విజువల్ వండర్‌గా తెరకెక్కిన మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.

 

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓజాస్ గంభీరగా పవన్ చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్ థియేటర్లను షేక్ చేశాయి. అయితే, పార్ట్-1 ఎండింగ్‌లో జపాన్ కనెక్షన్‌ను రివీల్ చేస్తూ సుజీత్ వదిలిన హింట్స్, అప్పుడే ‘OG 2’పై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి.ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ, ఫిలింనగర్ సర్కిల్స్ నుండి నెవర్ బిఫోర్ లీక్స్ అందుతున్నాయి.

 

నవంబర్ నుంచే ఇంటర్నేషనల్ షెడ్యూల్స్!

అవును ..అందరూ అనుకుంటున్నట్టుగా కాకుండా పవన్ కళ్యాణ్ ఈ ఏడాది నవంబర్ నుంచే ‘OG 2’ షూటింగ్‌కు బల్క్ డేట్స్ కేటాయించినట్లు ఇన్ సైడ్ టాక్ అయితే,పార్ట్-2 కథ పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతోంది. మొదటి భాగంలో కేవలం ముంబై డాన్‌గా చూపిస్తే, రెండో భాగంలో వరల్డ్ వైడ్ మాఫియా నెట్‌వర్క్‌ను ఢీకొట్టే గ్లోబల్ గ్యాంగ్‌స్టర్‌గా ఓజాస్ గంభీర కనిపించనున్నాడట. దీనికోసం సుజీత్ ఇప్పటికే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. జపాన్, యూరప్‌లోని కొన్ని కీలక దేశాల్లో దాదాపు 40 రోజుల పాటు భారీ విదేశీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఈ ఇంటర్నేషనల్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొనబోతుండటం గమనార్హం.

 

సెప్టెంబర్ 2న ‘OG 2’ అఫీషియల్ బ్లాస్ట్?

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటేనే సోషల్ మీడియాలో రికార్డుల వేట మొదలవుతుంది. ఈసారి సెప్టెంబర్ 2న ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్లాన్ చేస్తోంది. ‘OG 2’కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ కాన్సెప్ట్ పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందట.ఈ కాన్సెప్ట్ పోస్టర్‌లో జపాన్ సమురాయ్ కల్చర్‌కు మరియు ఓజాస్ గంభీర క్యారెక్టర్‌కు ఉన్న కనెక్షన్‌ను హింట్‌గా ఇవ్వబోతున్నారట. అదే కనుక జరిగితే సెప్టెంబర్ 2న నెట్టింట్లో సునామీ రావడం ఖాయం.

 

స్టోరీలైన్‌పై లీకైన క్రేజీ డీటెయిల్స్

ఇక ఫిలిమ్ సర్కిల్స్ లో .. ‘OG 2’ కథ కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్‌తో సాగుతుంది.అసలు ఓజాస్ జపాన్ ఎందుకు వెళ్ళాడు? అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? అనే అంశాలను పార్ట్-2లో రివీల్ చేయనున్నారు. మొదటి భాగంలో ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్‌ను మించి, పార్ట్-2లో ఒక ఇంటర్నేషనల్ యాక్టర్‌ను మెయిన్ విలన్‌గా దింపే ఆలోచనలో ఉందట సుజిత్ టీమ్

 

థమన్ మ్యూజికల్ మ్యాజిక్

ఇక మొదటి భాగానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోసిన థమన్, ఈసారి గ్లోబల్ ట్యూన్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించడానికి ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేశాడట.ప్రస్తుతానికి ఈ అప్‌డేట్స్‌పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, లోపల జరుగుతున్న ప్రొడక్షన్ పనులు చూస్తుంటే ‘OG 2’ ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, సుజీత్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరోసారి సునామీఖాయం.

ANN TOP 10