ప్రజలతో మమేకం అవుతూ..
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ..
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బస్తీబాట
ఆదిలాబాద్: రాష్ట్రంలో ఓబీసీలు దగా పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో పల్లెపల్లెకు ఓబీసీ-ఇంటింటకీ బీజేపీ కార్యక్రమం చేపట్టారు. అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపించే ప్రజా నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతీరోజూ ఉదయం 6-30 నుంచే బస్తీ బాట నిర్వహిస్తూ స్థానిక సమస్యలను ఎండగడతున్నారు. వాటికి పరిష్కారం చూపాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నారు. అనంతరం ప్రజా సేవాభవన్ కు తన సాయం కోరి వచ్చేవారికి అండగా నిలుస్తున్నారు. తమ బాధలు చెప్పకోవడానికి వచ్చేవారికి భరోసా నిస్తున్నారు. ఇప్పటివరకు ఆదిలాబాద్ లో ఏ నాయకుడు చేయనివిధంగా అనేక సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజా నేత గా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఏ సమయంలోనైనా శ్రీనన్న ఉన్నారంటూ అని వారికి కొండంత ధైర్యం నింపుతున్నారు. కంది శ్రీనన్నఅంటే జనం మనిషిగా, జనం మెచ్చిన నేత ఎవరంటే కంది శ్రీనన్న అనేంతలా జనంతో కలిసిపోతున్నారు. అందుకే ఆదిలాబాద్ నియోజక వర్గంలో ఏ తలుపు తట్టినా కంది శ్రీనన్న స్పర్శే కనిపిస్తోంది. ఏ గడప నెక్కినా కంది శ్రీనివాస రెడ్డి పేరే వినిపిస్తోంది.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరికి సాధ్యం కాని రీతిలో అనేక సమాజ హిత, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన కంది శ్రీనివాస రెడ్డి తాజాగా బస్తీబాటతో ప్రజల విశ్వాశాన్నిసైతం పొందగలిగారు.బస్తీబాటలో భాగంగా పట్టణంలోని అనేక ప్రాంతాలు చుట్టి వచ్చిన ఆయన స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని సందర్శించారు. వాకర్స్ తో కలిసి నడుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే జాగింగ్ చేస్తున్న యువకులు కంది శ్రీనివాస రెడ్డిని తమను తాము పరిచయం చేసుకున్నారు.ఆర్మీకి ఎంపికయ్యేందుకు కసరత్తు చేస్తున్న యువకులను అభినందించిన కంది శ్రీనివాస రెడ్డి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.