AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ను ఒక కిలోమీటర్ లోతులో బొందపెడతాం.. కవిత సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాలమూరు గడ్డపై సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌కు 12 సీట్లు కట్టబెడితే ఈ రెండున్నర ఏళ్లలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఎద్దేవా చేశారు. కృష్ణా నది నీళ్లు మన పొలాలకు రాకుండా చేస్తున్న ఈ ద్రోహానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కిలోమీటర్ లోతులో గొయ్యి తీసి బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు.

 

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదని ఆరోపించారు. కృష్ణా నది నుంచి నీటిని మళ్లించే విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వల్లే నేడు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి నీళ్లు తీసుకోవడానికి జీవో 72 ఉండగా తెలంగాణ వచ్చాక దానిని కావాలనే శ్రీశైలంకు మార్చారని విమర్శించారు. శ్రీశైలం వద్ద అప్రోచ్ ఛానల్ వెడల్పును 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గించి కాంట్రాక్టర్లకు మేలు చేశారని ధ్వజమెత్తారు.

 

విద్య వైద్య రంగాల్లో ప్రజలకు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం నుంచి పేదలను రక్షించేందుకు ప్రభుత్వం ద్వారానే ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువంటి అనారోగ్యం వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే కార్పొరేట్ వైద్యం అందిస్తుందని తెలిపారు. యువత సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు నేరుగా ప్రభుత్వ రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రతి 3 వేల ఎకరాలకు ఒక లష్కర్‌ను నియమించి సాగునీటి నిర్వహణను మెరుగుపరుస్తామని వివరించారు.

ANN TOP 10