మేనేజర్‌ను పోల్‌కు కట్టేసి.. రాడ్డుతో చితకబాది చంపేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో దారుణం జరిగింది. షాజాహన్‌పూర్‌లో ఓ మేనేజర్(Manger)ను చితక్కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి ముందు పడేశారు. ట్రాన్స్‌పోర్టు వ్యాపారవేత్త వద్ద శివమ్ జోరీ(Shivam Jori) అనే వ్యక్తి మేనేజర్‌గా చేస్తున్నాడు. అయితే ఓ పార్సిల్ మిస్సింగ్ విషయంలో అతనిపై ఆ కంపెనీ ఓనర్లు అటాక్ చేశారు. ఓ పోల్‌కు కట్టేసి మరీ అతన్ని రాడ్డుతో చిదకబాదారు.
