AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చీమలపాడు ఘటన.. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు

హైదరాబాద్‌: మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, లోకసభలో బీఆర్‌ఎస్‌ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌ రావులతో కలిసి చీమలపాడు ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. గురువారం ఉదయం మంత్రులు కేటీఆర్‌, అజయ్‌ కుమార్‌, ఎంపి నాగేశ్వరరావులతో పాటు నిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు. అందులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరామర్శించి ప్రభుత్వం, పార్టీ కొండంత అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వారు నిమ్స్‌ అధికారులు, వైద్యుల బృందంతో మాట్లాడి మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. గాయపడిన వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలని, వీరి సహాయకులు, కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండాల్సిందిగా నిమ్స్‌ ఓఎస్డి డాక్టర్‌ గంగాధర్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్పలకు కేటీఆర్‌ పలు సూచనలు చేయడంతో పాటు సలహాలిచ్చారు.

ANN TOP 10