ఉప్పల్ లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు వేడుక ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కానుకలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు మైనారిటీలను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో.. విదేశాలకు వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం యువత కృషి చేయాలని సూచించారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.
