ఖమ్మం జిల్లా చీమలపాడు ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బీఆర్‌ఎస్ స్వార్థ రాజకీయాలకు ముగ్గురు పేదలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.మృతి చెందిన ముగ్గురు ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.గాయపడ్డ వారికి అతున్నత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మృతి చెందిన వారి కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో చేస్తున్న రాజకీయాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
