AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ధర్మపురి సంజయ్ ఇంటిపై దుండగుల దాడి

నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి జరిగింది.వినాయక నగర్ లోని ఫస్ట్ మేయర్ స్ట్రీట్ లోని సంజయ్ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు.రౌడీ షీటర్ సందీప్ వర్మ అలియాస్ చోర్ బబ్లూతో పాటు మరో వ్యక్తి.. కారుతో సంజయ్ ఇంటి గేటును ఢీకొట్టారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కూడా అటాక్ చేశారు.పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..వెంటనే అక్కడి నుండి పరారయ్యారు.ఈ దాడికి కారణాలు తెలియాల్సి ఉంది. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.

కాగా రౌడీ షీటర్ సందీప్ వర్మపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.నేమ్, ఫేమ్ పేరిట గతంలోనూ పలువురు ప్రముఖులపై దాడులకు పాల్పడ్డాడు.హైదరాబాద్ పార్క్ హయత్ వద్ద బౌన్సర్లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కేసులోనూ సందీప్ వర్మ నిందితుడిగా ఉన్నాడు.నిజామాబాద్ జిల్లా నడిపల్లిలో సర్పంచ్ కారును పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కేసులో..అతన్ని నగరం నుండి బహిష్కరించారు.బహిష్కరణ విధించడంతో సందీప్ వర్మ గత కొంతకాలంగా నిజామాబాద్ నగరానికి దూరంగా ఉన్నాడు.

ANN TOP 10