AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కలిసి పోరాడితే విజయం మనదే

బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్‌: ఏ సంఘమైనా కలిసికట్టుగా పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ సెంట్రల్‌ గార్డెన్‌ లో జరిగిన ఓసీ సంక్షేమ సంఘ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంఘ నాయకులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఓసీ కులాలలోని పేదల సంక్షేమానికి సంఘ సభ్యలు పాటుపడాలని సూచించారు. ఆత్మస్తుతి ,పరనింద మంచివి కావని హితవు పలికారు. దేహి అని చేయి చాచకుండా ఐక్యంగా పోరాడి సాధించుకోవాలన్నారు. చదువొక్కటే అభివృద్ధికి సోపానమని ఓసీ బిడ్డలందరూ చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. సంఘ సంక్షేమానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన వెంట కిష్టా రెడ్డి, బండి కిష్టాన్న, లింగన్న,కదరపు దేవిదాస్‌ పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANN TOP 10