AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోకో పైలట్ చేసిన వింత పని….

ఉత్తరప్రదేశ్‌లో గూడ్స్ రైలును నడిపే ఒక లోకో పైలట్ చేసిన వింత పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం సిగరెట్లు కొనుగోలు చేయడం కోసం ఏకంగా రైలును రైల్వే క్రాసింగ్ వద్ద నిలిపివేసి, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది.

ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలోని మల్కన్ రైల్వే క్రాసింగ్ వద్ద చోటుచేసుకుంది. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు బొగ్గును అన్ లోడ్ చేసి తిరిగి వస్తున్న ఆ గూడ్స్ రైలును, లోకో పైలట్ సుమారు 10 నిమిషాల పాటు క్రాసింగ్ వద్ద ఆపేశాడు. అనంతరం ఆయన రైలు దిగి పట్టాలు దాటి వెళ్లి సమీపంలోని ఒక కిరాణా దుకాణంలో సిగరెట్లు కొనుగోలు చేసి తిరిగి రావడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. రద్దీగా ఉండే ఆ లెవల్ క్రాసింగ్ వద్ద రైలు ఆగడంతో అంబులెన్సులు, ఇతర వాహనాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.

ఈ ఘటనపై స్థానికులు మరియు వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనుల మీద వెళ్లే వారికి లోకో పైలట్ నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఆటంకం కలిగిందని విమర్శిస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. లోకో పైలట్ అనుమతి లేకుండా రైలు దిగి వెళ్లడంపై వివరణ కోరారు. విచారణ నివేదిక అందిన తర్వాత సదరు లోకో పైలట్‌పై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

ANN TOP 10