AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పుతిన్ ఆస్తుల చిట్టా చూస్తే మైండ్ బ్లాంక్: లెక్కల్లో రూ. 18 లక్షల కోట్లు, 58 విమానాలు, 19 ఇళ్లు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన నేపథ్యంలో, ఆయనకు సంబంధించిన అనధికారిక ఆస్తుల వివరాలపై నెటిజన్ల అన్వేషణ మొదలైంది. అధికారికంగా ఆయన జీతం సంవత్సరానికి $140,000 (సుమారు రూ. 1.2 కోట్లు) మరియు కొన్ని ఆస్తులు మాత్రమే ఉన్నప్పటికీ, కొన్ని అంతర్జాతీయ నివేదికలు మరియు అమెరికన్ ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ చేసిన సంచలన ఆరోపణల ప్రకారం, పుతిన్ నికర ఆస్తుల విలువ సుమారు $200 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 18 లక్షల కోట్ల పైమాటే) ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన పుతిన్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ కంటే కూడా ధనవంతుడవుతారని తెలుస్తోంది.

పుతిన్‌కు సంబంధించిన అనధికారిక ఆస్తుల చిట్టా మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. ఆయనకు అనధికారికంగా సుమారు 19 ఇళ్లు, 700 కార్లు, 58 విమానాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. వీటిలో $716 మిలియన్ డాలర్ల విలువైన ‘ది ఫ్లయింగ్ క్రెమ్లిన్’ అనే ప్రత్యేక విమానం, మరియు $700 మిలియన్ డాలర్ల విలువైన ఒక లగ్జరీ యాచ్ కూడా ఉన్నాయట. అంతేకాకుండా, ఆయన జీతం కంటే కూడా ఎక్కువ ఖరీదైన వాచ్‌ల కలెక్షన్ ఆయన వద్ద ఉందని టాక్.

ఆయన అనధికారిక ఆస్తులలో అత్యంత ప్రముఖమైనది, నల్ల సముద్రం ఒడ్డున ఉన్న $1 బిలియన్ డాలర్ల విలువైన ప్యాలెస్. ఈ ప్యాలెస్ పుతిన్ పేరు మీద కాకుండా ఆయన స్నేహితుడి పేరు మీద ఉన్నప్పటికీ, అది పుతిన్ బినామీ ఆస్తి అని ప్రచారం ఉంది. ఈ విలాసవంతమైన ప్యాలెస్‌లో పాలరాతి స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ యాంఫీ ధియేటర్, అండర్‌గ్రౌండ్ ఐస్ హాకీ రింక్, క్యాసినోతో పాటు, బాత్రూం కడగడానికి కూడా $850 విలువైన ఇటాలియన్ టాయిలెట్ బ్రష్‌లు ఉన్నాయనే టాక్ ఉంది.

ANN TOP 10