AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుక్కపిల్లతో పార్లమెంట్ వచ్చిన ఎంపీ రేణుకా చౌదరి సంచలనం

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా తన కారులో ఒక చిన్న శునకంను తీసుకురావడం రచ్చగా మారింది. తాను కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక శునకం పిల్ల దొరికిందని, ఇతర వాహనాల కింద పడకుండా దాని ప్రాణాన్ని కాపాడే ఉద్దేశంతోనే కారులో తీసుకొచ్చానని ఆమె తెలిపారు. అయితే, భద్రతా సిబ్బంది ఆ శునకంను అడ్డుకోవడంతో ఈ ఘటన వివాదాస్పదమైంది.

భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఆగ్రహించిన రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ శునకం కరవదు. కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారు” అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా, ఆ జీవి ప్రాణాల్ని కాపాడితే తప్పేంటని, పార్లమెంట్ లో కుక్కల్ని తీసుకొని రావద్దని ఏదైనా చట్టముందా అని ప్రశ్నిస్తూ, నోరులేని జీవాన్ని కాపాడితే అది పెద్ద చర్చ అవుతుందా అంటూ ఆమె ఏకీపారేశారు.

రేణుకా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఇది పార్లమెంట్ ను, సభామర్యాదలను, ఇతర ఎంపీలను అవమానించడమేనని ఆరోపించారు. తన సహచర ఎంపీలందరినీ రేణుక చౌదరీ కుక్కలతో పోల్చారని, కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడ్డారు.

ANN TOP 10