మహారాష్ట్ర బీజేపీ మంత్రి పంకజ ముండే పీఏ అయిన అనంత్ గాడ్జే భార్య డాక్టర్ గౌరీ పాల్వే ఆత్మహత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. శనివారం సాయంత్రం ముంబైలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గౌరీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంత్ గార్జేతో పాటు అతని కుటుంబంలోని మరో ఇద్దరు సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం అర్థరాత్రి వర్లి పోలీసులు అనంత్ గార్డేను అరెస్టు చేశారు.
విచారణలో, గౌరీ ఆత్మహత్య చేసుకునే కొద్ది నిమిషాల ముందు దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు వెల్లడైంది. గొడవ తర్వాత అనంత్ ఒక కార్యక్రమానికి వెళ్లిపోయి, తిరిగి వచ్చేసరికి గౌరీ ఉరివేసుకున్నారు. భర్త అనంత్ గార్జ్ వివాహేతర సంబంధాలే గౌరీ ఆత్మహత్యకు ప్రధాన కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది తిరగకముందే ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం కలచివేస్తోంది.
అనంత్ గార్డేకు పెళ్లికి ముందే మరో మహిళతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంత్ వాట్సాప్లో లభించిన కొన్ని పత్రాలలో ఈ విషయం బయటపడింది. ఆ పత్రంలో 2021 నాటి గర్భధారణ సమ్మతి, డిక్లరేసన్ ఫామ్ ఉండగా, అందులో మహిళ పేరు కిరణ్, భర్త పేరు అనంత్ గార్జ్ అని ఉంది. ఈ సంబంధం గురించి గౌరీ తండ్రి ఆమెను ఇంటికి రమ్మని అడగ్గా, అనంత్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు సమాచారం.









