AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐ బొమ్మ రవి అరెస్ట్: కోట్లు సంపాదించిన పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడి నిజాలు

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ (iBomma) నిర్వాహకుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి పూర్తి పేరు ఇమ్మాడి రవి అని, ఆయన కరేబియన్ దీవుల నుంచి ఈ సైట్‌ను రహస్యంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సైట్ పేరులో ఉన్న “I” తన ఇంటి పేరు ఇమ్మాడి నుంచి, “బొమ్మ” సినిమాలకు సూచనగా తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అరెస్ట్‌తో టాలీవుడ్ పైరసీకి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల దర్యాప్తులో రవి పైరసీ వెబ్‌సైట్ ద్వారా కోట్లు సంపాదించినట్లు తేలింది. మధ్యతరగతి జీవితం గడిపిన రవి, తన భార్య లగ్జరీ జీవితం కోసం ఆరాటపడటం, ఆర్థిక అవసరాలు పెరగడం వల్లే ఈ పైరసీ మార్గాన్ని ఎంచుకున్నానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తన కంప్యూటర్ నైపుణ్యాన్ని ఉపయోగించి ఐ బొమ్మను సృష్టించిన రవి, సినిమాలను అప్‌లోడ్ చేసి, ప్రమోషన్ల ద్వారా భారీగా ఆదాయం పొందాడు. ఒక నెలలో ఏకంగా రూ. 80 లక్షల వరకు సంపాదించి, కొద్ది కాలంలోనే కోట్లు కూడబెట్టాడు. పోలీసుల వద్ద రవికి సంబంధించిన 25,000కి పైగా సినిమాల హార్డ్ డిస్క్‌లు లభించాయి.

రవి కేసు సోషల్ మీడియాలో పెద్ద వివాదాస్పదంగా మారింది. కొందరు రవి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, చాలా మందికి ఉచితంగా సినిమాలు చూడగలిగే సౌకర్యాన్ని కల్పించిన కారణంగా, మరికొందరు అతన్ని ఒక హీరోగా కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే, డేటా సేఫ్టీ, కాపీ రైట్ మరియు చట్టపరమైన అంశాల దృష్ట్యా రవి చర్య పూర్తిగా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సైబర్ నేరం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

ANN TOP 10