హైదరాబాద్:
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. నూతన కమిటీ సభ్యులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా అశోక్ దయ్యాల బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు అశోక్ దయ్యాలకు రిటర్నింగ్ ఆఫీసర్స్ దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , కొండ శ్రీనివాస్ గార్లు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ (JCHSL) అధ్యక్షుడు గోపరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీని సత్కరించారు. దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మరో వైపు ఈసీమెంబర్ గా నియామక పత్రం అందుకున్న అశోక్ దయ్యాలను ఎఎన్ఎన్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి , ఎఎన్ఎన్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గడ్డం , ఎఎన్ఎన్ జనరల్ మేనేజర్ అరవింద్ రెడ్డి మందడి అభినందించారు…









