ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి ఫోన్ లో పరామర్శించారు. గత ఆదివారం ఆయన బావమరిది అఖిల్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందడంతో కంది శ్రీనివాస రెడ్డికి మంత్రి ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. అఖిల్ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి తీరని లోటని చిన్నవయసులో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు








