ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ త్వరలో జరగనున్న నేపథ్యంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తమ ఆటగాళ్ల ఎక్స్ఛేంజ్పై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, అంచనాలను అందుకోలేకపోయిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (రూ. 11.25 కోట్లు)ను ట్రేడ్ చేసి, ఆ పర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న సంజూ శాంసన్‌ను తీసుకోవాలని SRH యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్‌ను ట్రేడ్ విండో ద్వారా ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి అతని మాజీ జట్టు ముంబై ఇండియన్స్ తో సహా మొత్తం మూడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్‌ను రిలీజ్ చేస్తే, SRH అతడిని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలని భావిస్తోంది. సంజూ శాంసన్ ఒక మంచి రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్, బిగ్ హిట్టర్, అటు వికెట్ కీపర్‌గా, ఇటు మిడిలార్డర్ బ్యాటర్‌గా జట్టుకు బలంగా ఉపయోగపడగలడు. అంతేకాకుండా, అతనికి కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. సంజూ ట్రేడ్‌కు అందుబాటులో ఉంటే, ఎంత మొత్తానికైనా అతడిని తీసుకోవడానికి SRH సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ట్రేడ్ కనుక జరిగితే, ఇది ఐపీఎల్లో ఒక పెద్ద సర్ ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపు నవంబర్ 15వ తేదీకి రిటైన్, రిలీజ్ లిస్ట్‌లను ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంది. అయితే, SRH జట్టులో ముఖ్య ఆటగాళ్లుగా ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ మాత్రం రిటైన్ లిస్టులో ముందు వరుసలో ఉన్నారు.









