అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ‘ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బమ్ యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందనను పొందుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్‌ను దాటడం విశేషం. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌లో అనిల్ ఇనుమడుగు హీరోగా, వేణి రావ్ హీరోయిన్‌గా నటించారు. ముఖ్యంగా, అనిల్ ఇనుమడుగు లీడ్ రోల్‌లో నటిస్తూనే, ఈ పాటకు లిరిక్స్ రాసి, దర్శకత్వం వహించడం ఈ ఆల్బమ్ యొక్క ప్రత్యేకత. ఈ పాటను మార్క్ ప్రశాంత్ సంగీతం అందించగా, దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు.
కేరళలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే అనాథ కుర్రాడి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ పది నిమిషాల మ్యూజిక్ వీడియో, అందమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా విడుదలైన ఈ వీడియో, సున్నితమైన కాన్సెప్ట్, చక్కటి దర్శకత్వం, అద్భుతమైన మ్యూజిక్‌తో విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ కేరళ సౌందర్యాన్ని అద్భుతంగా చూపించి, ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా మలిచారు.
హీరో హీరోయిన్లుగా నటించిన అనిల్ ఇనుమడుగు, వేణి రావ్ జంట స్క్రీన్‌పై సహజంగా నటించి మంచి కెమిస్ట్రీని చూపించారు. యంగ్ ప్రొడ్యూసర్స్ అజయ్ కుమార్ ఇనమడుగు మరియు విష్ణు పాదర్తి నిర్మించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.









