AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ ద్వారా మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ప్రమోషన్లలో భాగంగా దూకుడు పెంచిన మేకర్స్.. ఇటీవల విడుదల చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమోకు అద్భుతమైన స్పందన రావడంతో, తాజాగా ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మరియు నయనతార అందాలతో అలరిస్తోంది.

‘హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..” అంటూ సాగే ఈ పాట భార్యాభర్తల మధ్య సరదా సన్నివేశంలో చిత్రీకరించబడింది. ఇందులో చిరంజీవి, నయనతార భార్యాభర్తలుగా నటించారు. తనపై అలిగిన నయనతారను ఆటపట్టిస్తూ, బుజ్జగించే సందర్భంలో ఈ పాటను షూట్ చేశారు. చిరంజీవి తనదైన గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో ఆకట్టుకోగా, నయనతార మరింత అందంగా కనిపించింది. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే మెగా అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది.

ఈ పాట సంగీతపరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీనికి భీమ్స్ సిసిరోలియో ట్యూన్ కంపోజ్ చేయగా, సందర్భానికి తగినట్లుగా అందరూ పాడుకునేలా సరళమైన పదాలతో భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించారు. బాలీవుడ్ సీనియర్ గాయకుడు ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ గాత్రాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ANN TOP 10