AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఓ ప్రైవేట్ ఈవెంట్ కోసం ముంబైకి వచ్చింది. ఆమె కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండనుంది. కాగా తనకెంతో ఇష్టమైన ముంబై నగరంలో తాను గడిపిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది ప్రియాంక. తాజాగా ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకుంది ప్రియాంక . ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తిని కూడా ఆలయానికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దేవాలయంలోని అర్చకులు ప్రియాంక, ఆమె కూతురికి ఆశీర్వచనం అందజేశారు.

ANN TOP 10