మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడి పెరగడంతో అధికారులు బ్యారేజీ మొత్తం 175 గేట్లను ఎత్తేశారు. దీంతో 2,00,600 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. వరద కారణంగా పలు లంక గ్రామాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో నీరు చేరుతోంది. నాలుగు గ్రామాలకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అత్యవసరమైన వారు పడవలపై ప్రయాణం చేస్తున్నారు.
