మనకు పక్కనే కృష్ణా నది ఉన్నప్పటికీ తెలంగాణకు ఫలితం లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని, తాగునీరు లేక గొంతులు తడారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కన పెట్టిందని ఆరోపించారు.
ఇది కాలం పెట్టిన శాపం కాదని, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శఠగోపం అని మండిపడ్డారు. జాగో తెలంగాణ జాగో అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే కరవు అని, కరవు అంటే కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్‌పై కోపంతో కాళేశ్వరం పునరుద్ధరణ పనులను నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు.