రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వెలువడిన అనంతరం జీవిత ఖైదు విధించిన అరుగురు నిందితులను నల్గొండ జిల్లా పోలీసులు భారీ భద్రత నడుమ జిల్లా జైలుకు తరలించారు. నిందితుల్లో A1 గా ఉన్న మారుతి రావు చనిపోగా A2 సుభాష్ శర్మ కు ఉరిశిక్ష పడింది. నిందితులను కోర్టులో హాజరు పరచగా తీర్పు వచ్చిన అనంతరం శిక్ష తగ్గించమని నేరస్థులు జడ్జిని వేడుకున్నారు.
కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి స్పందన
తీర్పు అనంతరం నిందితులను జైలుకు తరలించారు.గుజరాత్ లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న A3 ఐఎస్ఐ ఉగ్రవాది అజ్గర్ అలీను తిరిగి అక్కడికి పంపించారు. కోర్టు తీర్పు అనంతరం ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ న్యాయం గెలిచిందని అన్నారు. తమ కన్నీళ్ళకు, పోరాటానికి ఫలితం ఇవ్వాళ తీర్పుగా వచ్చిందన్నారు.
నిందితుడు శ్రవణ్ కుమార్ తప్పు చెయ్యలేదని కుటుంబసభ్యుల వాగ్వాదం
తన తండ్రి ఎటువంటి తప్పు చేయకుండానే ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారని నిండుతులలలో ఒకరైన శ్రవణ్ కుమార్ కుటుంబసభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన తండ్రికి ఈ కేసుతో సంబంధం లేదన్నారు. మొత్తం మీడియా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పి వారిని అక్కడినుండి పంపించారు.
ఏవీ రంగనాథ్ కు అమృత ఫోన్
నిందితులకు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ..నిందితులను జైలుకు కఠిన శిక్ష పడిందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఇదిలా ఉంటే ఆనాడు నల్గొండ SP గా ఉన్న, నేడు హైడ్రా కమీషనర్ అయిన ఏవీ రంగ నాధ్ కు అమృత ఫోన్ కాల్ చేశారు. ప్రణయ్ ను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష, మిగతావారికి జీవిత ఖైదు పడేలా కేసు నిలబెట్టినందుకు రంగనాథ్ కు అమృత కృతజ్ఞతలు తెలిపారు.
హామీ ఇచ్చినట్టు గానే ఇపుడు తీర్పు వచ్చిందన్న ఏవీ రంగనాథ్
కేసులో తమకు మొదటి నుంచి సహకరించిన అమృతకు తిరిగి కృతజ్ఞతలు తెలిపిన IPS అధికారి AV రంగనాధ్. నీకు హామీ ఇచ్చినట్టు గానే ఇపుడు తీర్పు వచ్చింది అని అమృతకు తెలిపిన రంగ నాధ్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ పోరాటానికి న్యాయం జరిగిందని అమృత, ప్రణయ్ తల్లి కోర్టు తీర్పును స్వాగతించారు.