AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రోల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్..?

సాధారణంగా హీరోలు సినిమాలలోనే కాకుండా పలు యాడ్స్ కూడా చేస్తూ భారీగా సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ యాడ్స్ కోసం యాడ్ మేనేజ్మెంట్ చెప్పినట్టే తమ మేకోవర్ ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మేకోవర్స్ ఒక్కోసారి అభిమానులను పూర్తిగా హర్ట్ చేస్తాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అంటే అభిమానులకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన గెటప్ కి ఎంతోమంది అమ్మాయిలు అభిమానులుగా మారిపోయారు. అలాంటి ఆయన గెటప్ ఇప్పుడు సడన్గా మారిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిందీలో అక్షయ్ కుమార్ (Akshay kumar) చేసిన ఒక యాడ్ ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ (NTR ) విద్యుల్లేఖ(Vidyullekha Raman) తో కలిసి చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఎన్టీఆర్ గెటప్ పై అభిమానులు హర్ట్ అవుతూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

 

ఎన్టీఆర్ కొత్త లుక్.. హర్ట్ అయిన ఫ్యాన్స్..

 

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఎన్టీఆర్ ఒక క్విక్ కామర్స్ కంపెనీకి యాడ్ చేశారు. అందులో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పూర్తిగా మిస్ ఫైర్ అయిందని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు పూర్తిస్థాయిలో హర్ట్ అవుతున్నారు. ఇదెక్కడి లుక్ రా బాబు.. ఎలాంటోడిని ఎలా మార్చేశారు.. డబ్బు కోసం ఎలా అయినా మార్చేస్తారా? అని కంపెనీపై కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది ఒక టైగర్ ని ఇలా మార్చేసారేంటి అంటూ కాస్త ఘాటుగానే కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు అయితే పూర్తిస్థాయిలో హర్ట్ అయ్యారని తెలుస్తోంది. మరి దీనిపై ఎన్టీఆర్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.

 

ఎన్టీఆర్ సినిమాలు..

 

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ చివరిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకొని, ఆ తర్వాత ప్రేక్షకులను మెప్పించి, నెమ్మదిగా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘డ్రాగన్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలైంది. దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమా షూటింగు ప్రారంభం అయ్యింది. ఈనెల ఆఖరిలో ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. మరొకవైపు హిందీలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మీద కలసి దాదాపు 500 మంది డాన్సర్లతో ఒక పాటను కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10