AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్పామ్ కాల్స్ చెక్.. కొత్త యాప్ తీసుకువచ్చిన కేంద్రం..

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మోసపూరిత కాల్స్, అనుమానిత (స్పామ్) కాల్స్ బెడద ఎక్కువైంది. అనేక మంది అనుమానిత కాల్స్, సందేశాలతో మోసపోతున్నారు. వారికి తెలియకుండానే వారి బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయం అవుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి.

 

ఈ నేపథ్యంలో టెలికం శాఖ ఈ మోసపూరిత కాల్స్, సందేశాలకు చెక్ పెట్టేందుకు కొత్తగా సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ యాప్ ను శుక్రవారం విడుదల చేశారు.

 

ఆ యాప్ ద్వారా అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు వచ్చిన సమయంలో కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా వారి పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. తమ పేరు మీద అనధికారికంగా ఏవైనా నంబర్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు.

 

మొబైల్ అపహరణకు గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది. మొబైల్ ఫోన్ ప్రామాణికతను కూడా యాప్ సాయంతో గుర్తించవచ్చు. ఇందుకోసం ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ANN TOP 10