AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించనున్నారు. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

 

రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10 శాతం గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించబోతున్నట్టు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

ANN TOP 10