AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజమండ్రిలో రేవ్ పార్టీ కలకలం-20మంది అరెస్టు

ప్రశాంతంగా ఉండే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ చేశారు. దాదాపు 20 మందికి పైగా యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు నగరంలో రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు, ఎవరు అనుమతి ఇచ్చారు, ఇందులో ఏమేం వాడారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఈ మధ్య కాలంలో వరుసగా రేవ్ పార్టీలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజమండ్రి రేవ్ పార్టీ కలకలం రేపుతోంది.

రాజమండ్రిలోని కొరుకొండ జంక్షన్ బూరుగుపూడి వద్ద ఉన్న నాగసాయి ఫంక్షన్ హాల్లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. ఇప్పటివరకూ రేవ్ పార్టీలు శివార్లలో ఉండే రిసార్ట్స్ లలోనే జరుగుతుండగా తొలిసారి ఈ రేవ్ పార్టీ మాత్రం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లోనే నిర్వహించారు. పెద్ద పెద్ద డీజే సౌండ్లతో, మద్యం తాగుతూ వీరు రేవ్ పార్టీ చేసుకుంటుండగా గమనించిన స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. ఫంక్షన్ హాల్ కు చేరుకుని అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సమాచారం సేకరించేందుకు ప్రయతిస్తున్నారు.

నగరంలోని ఎరువుల కంపెనీల యజమానులు ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విషయం తెలియగానే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ రేవ్ పార్టీపై దాడి చేశారు. ఇందులో అక్కడికక్కడే 13 మంది యువకులు, ఐదుగురు యువతులతో పాటు మరికొందరు బయటి వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మూడు కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయిత్ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడలేదని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు.. ఇందులో పాల్గొన్న వారు మద్యం మాత్రమే సేవించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత బహిరంగంగా ఫంక్షన్ హాల్లోనే ఈ పార్టీ నిర్వహించడం వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10