మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు రష్యాలోని ఎత్తైన భవనాలను ఢీకొట్టి పేలాయి. (Drone Attack) 2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను విమానాలు ఢీకొన్న సంఘటనను ఈ దాడి తలపించింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శనివారం ఉదయం రష్యాలోని కజాన్ నగరంపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. రెండు ఎత్తైన భవనాలను రెండు డ్రోన్లు ఢీకొని పేలిపోయాయి. మంటలు చెలరేగడంతో నల్లటి పొగలు దట్టంగా వ్యాపించాయి.
కాగా, ఎత్తైన ఆయా భవనాల్లోని నివాసితులను సురక్షితంగా ఖాళీ చేయించినట్లు రష్యా మీడియా తెలిపింది. అయితే ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొంది. ఈ సంఘటన నేపథ్యంలో కజాన్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.
మరోవైపు 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ట్విన్ టవర్లపై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారు. హైజాక్ చేసిన విమానాలతో ఎత్తైన టవర్ బిల్డింగ్‌లను ఢీకొట్టారు. దీంతో దట్టంగా మంటలు, పొగలు వ్యాపించాయి. అయితే డిసెంబర్ 21న రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి 9/11 ఉగ్రదాడిని తలపించింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#Ukraine launches drone attack on residential buildings in Kazan, causing fire#BREAKİNG pic.twitter.com/w3l7qxQXhJ
— APA News Agency (@APA_English) December 21, 2024