హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాదాపూర్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం ఆరు గంటలకు మాదాపూర్ ప్రాంతంలో సత్వ కంపెనీ భవనంలోని నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పొగ మెల్ల మెల్లగా బయటకు రావడంతో ఏం జరిగిందో తెలీక అందులోవున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ ఇంజన్లకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో నిగమ్నమయ్యారు.
గంటన్నర తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరు గాయపడ లేదని అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన సమీపంలో టెక్కీ కంపెనీ ఉండడంతో ఉద్యోగులను అధికారులను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.