AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘దొంగ’ వర్సెస్ ‘యూజ్ లెస్ ఫెల్లో’.. హాట్ హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు..!

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, విమర్శలు, మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. అయితే.. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర అప్పులపై స్వల్పకాలిక చర్చ నడుస్తున్న క్రమంలో.. ‘దొంగ’ వర్సెస్ ‘యూజ్ లెస్ ఫెల్లో’ అన్నట్టుగా పరిస్థితి ఒక్కసారిగా హాట్ హాట్‌గా మారింది. అయితే.. చర్చలో భాగంగా హరీష్ రావు మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షం నేతలు రన్నింగ్ కామెంట్రీ చేశారు. అందులోనూ ఎవరో ఓ నేత.. దొంగ అంటూ సంబోధించటం హరీష్ రావు చెవినపడింది. దీంతో.. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఎవడయ్యా యూజ్ లెస్ ఫెలో.. దొంగ అన్నది” అంటూ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. దీంతో.. హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. తనను దొంగ అని అంటేనే.. తాను యూజ్ లెస్ ఫెలో అని అనాల్సివచ్చిందని.. అది తప్పా.. అంటూ హరీష్ రావు వివరణ ఇచ్చారు. వాళ్ల అలా అనొద్దు కదా అధ్యక్షా.. అంటూ హరీష్ రావు స్పీకర్‌ను ప్రశ్నించారు.

ఈ క్రమంలో స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. కాంగ్రెస్ సభ్యులు అన్న మాటలు మైక్‌లో మాట్లాడలేదని.. అది ఎవరికి వినబడలేదని.. కానీ హరీశ్ రావు మైక్‌లో మాట్లాడింది అందరికీ వినిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన హరీష్ రావు.. తనను దొంగ అని సంభోదిస్తేనే తాను అలా అన్నానని.. తనను అన్న సభ్యుడిని శ్రీధర్ బాబు సమర్థిస్తున్నారా అంటూ నిలదీశారు. తనపై రన్నింగ్ కామెంటరీ చేసిన సభ్యుడినే తాను అన్నానని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే.. మరోసారి రన్నింగ్ కామెంట్రీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “రాజగోపాల్ రెడ్డి.. మీరు హోమ్ మినిస్టర్ అయ్యాక మైక్ ఇస్తారని. ఇప్పుడు మీకు ఎలిజిబులిటీ లేదన్నారు. మీరు హోం మంత్రి కావాలి. ఐ విష్ యూ షుడ్ హోమ్ మినిస్టర్..” అంటూ హరీశ్ రావు సెటైర్లు వేశారు. సభను నడిపే పద్ధతి ఇది కాదని హరీష్ రావు అన్నారు.

హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. “హరీశ్ రావు ఒక సీనియర్ శాసన సభ్యుడు. ఆయన నాకు వ్యక్తిగతంగా దగ్గరి మిత్రుడు. ఆన్ రికార్డు మైక్‌లో ఓ సభ్యుడిని యూజ్ లెస్ ఫెలో అనడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే మీరు జీర్ణించుకోవడం లేదు. ఇక్కడ మాట్లాడేదంతా తెలంగాణ ప్రజలు వింటున్నారు. మేమే అధికారంలో ఉంటామని మీరనుకున్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుడిని పట్టుకుని అలా మాట్లాడుతున్న హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలి.” అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10