AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ‌.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో డిసెంబర్‌ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (9)కు గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. శ్రీతేజ్‌ను పరామర్శించి అతని ఆరోగ్యపరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించింది. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ రాలేకపోయారు. అల్లు అర్జున్‌ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని స్పష్టం చేశారు.

ఇప్పటికే జైలు నుంచి విడుదలైన సందర్భంగా అల్లు అర్జున్‌ మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న దుర‌దృష్టకరమని.. బాధిత కుటుంబానికి జ‌రిగిన న‌ష్టం పూడ్చ‌లేనిదన్నాడు. ఆ కుటుంబానికి మరోసారి నా క్ష‌మాప‌ణ‌ల‌తో పాటు సానుభూతి తెలుపుతున్నా. బాధిత కుటుంబానికి ఎల్ల‌ప్పుడు అండ‌గా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదన్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10