AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పరిటాల రవి హత్య కేసు.. 18 ఏండ్ల త‌ర్వాత‌ నిందితులకు బెయిల్‌

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంతపురం జిల్లాలో సంచ‌ల‌న సృష్టించిన మాజీ మంత్రి, టీడీపీ నేత‌ పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్ట్ నేడు బెయిల్ మంజూర్ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పండుగ నారాయణరెడ్డి (ఏ-3), రేఖమయ్య (ఏ-4), రంగనాయకులు (ఏ-5), వడ్డే కొండ (ఏ-6), ఓబిరెడ్డి (ఏ-8)ల‌కు.. 18 ఏండ్ల త‌ర్వాత ఏపీ హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన మద్దెలచెరువు సూరిని భాను కిర‌ణ్ అనే వ్య‌క్తి కాల్చి చంపిన విష‌యం తెలిసిందే.

టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో ప్ర‌ధాన నిందితుడు మద్దెలచెరువు సూరి. త‌న కుటుంబంలో ఉన్న అంద‌రిని హ‌త్య చేశాడు అన్న కోపంతో పరిటాల రవి చంపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు సూరి. ఈ క్ర‌మంలోనే 2005లో ప‌రిటాల ర‌విని కాల్చి చంపాడు. ఇక ప‌రిటాల ర‌విని హ‌త్య చేసిన కేసులో జైలు జీవితం గ‌డిపి బెయిల్ మీద‌ బ‌య‌ట‌కు వ‌చ్చిన సూరిని 2011 జనవరి 4న భాను కిర‌ణ్ కాల్చి చంపాడు. అనంతపురం ఫ్యాక్షన్ పేరు చెప్ప‌గానే ముందుగా గుర్తోచ్చే పేర్లు పరిటాల రవి, మద్దెలచెరువు సూరి, మొద్దు శీను, ఓం ప్రకాశ్, భాను కిరణ్. దీనిపైనే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ 2010లో ర‌క్త చ‌రిత్ర అనే సినిమా కూడా తీశాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10