AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో రేవంత్ సర్కారును నిలదీస్తాం.. కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తోందని.. ప్రజల ఆవేదనకు బీఆర్ఎస్ గొంతుకగా నిలుస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై అసెంబ్లీ, మండలిలో నిలదీస్తామన్నారు. గ్రామ పంచాయతీలలో నిధుల కొరతను ప్రశ్నించారు. సర్పంచులు, మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లింపులు జరగడం లేదని మండిపడ్డారు.

పల్లెప్రగతి ద్వారా దేశంలో అత్యుత్తమ గ్రామాలుగా తెలంగాణ గ్రామాలు నిలిచినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు పల్లె అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు కేటీఆర్. దళితబంధు పథకం అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అందుకే చెల్లింపులు జరగడం లేదన్నారు. రైతుబంధు రెండో విడత నిధుల విడుదల ఆలస్యం రైతుల కష్టాలను పెంచిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, లక్ష కోట్ల బడ్జెట్ వంటి హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీపైనా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందన్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ANN TOP 10