గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రదర్దు, మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కొత్త నోటిఫికేషన్ చట్టవిరుద్ధంగా ఉందని, అలాగే ప్రిలిమ్స్ కీలో 14 తప్పులు ఉన్నాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కానీ అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున పరీక్షను వాయిదా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కాగా, అభ్యర్థుల నుంచి ఎంతటి వ్యతిరేకత వచ్చినప్పటికీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను టీజీపీఎస్సీ అక్టోబర్ నెలలో నిర్వహించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా మెయిన్స్ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.