AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీత్యాగం పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తుంది.. కాసోజు శ్రీకాంతచారికి సీఎం నివాళి

తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతచారి వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ లో ఆయన ఫొటోతో కూడిన పోస్ట్‌ పెట్టారు. దీనిపై రేవంత్‌ రెడ్డి.. ‘నీ త్యాగం తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తోంద’ని కీర్తించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న ఉద్యమకారుడు శ్రీకాంత చారి 2009 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో రాష్ట్ర సాధనకై ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహుతి చేసుకొని మరణించిన విషయం తెలిసిందే.

ANN TOP 10