‘బనానా టేప్’ (taped banana) ఈ పదం ప్రస్తుతం తెగ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణంగా టేప్ వేసిన అరటిపండు కళ్లు చెదిరే ధర పలకడమే. ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఒక అరటిపండుకు నమ్మలేనంత ధర పలికిన విషయం తెలిసిందే.
గోడకు టేపుతో అతికించి ఉన్న ఆ అరటిపండును ఓ వ్యక్తి 6.24 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 52.7 కోట్లు)కు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చైనా పారిశ్రామికవేత్త జస్టిన్ సన్ వేలంలో దీనిని సొంతం చేసుకున్నాడు. అయితే, కొన్న తర్వాత ఆ అరటిపండును సెకన్ల వ్యవధిలోనే అతను తినేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇటలీ విజువల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలన్ 2019లో దీనిని సృష్టించాడు. గోడపై ఒక అరటిపండుకు టేప్ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతేమీ లేదు. ఈ అరటిపండుకు ‘కమెడియన్’ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ కదళీఫలం వార్తల్లో నిలుస్తోంది. ‘కమెడియన్’ పేరిట చేసిన ఈ అరటి పండు ఆర్ట్‌వర్క్‌ను మియామి బీచ్ ఆర్ట్ బాసెల్‌లో తొలిసారి ప్రదర్శించారు. ఇది ఐదేళ్ల క్రితం రూ.98 లక్షలతో అమ్ముడుపోయింది. ఆ తర్వాత కూడా ఇదే ధరకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కాటెలన్ దీని ధరను పెంచారు. తాజా వేలంలో ఇది ఏకంగా 6.2 మిలియన్ డాలర్లకు అమ్ముడోపోయి ఆశ్చర్యపరిచింది.
许多朋友问我这根香蕉的味道如何。老实说,对于一根有如此故事的香蕉,味道自然和普通香蕉不一样。我品尝出了一种100年前大麦克香蕉的味道。🍌 pic.twitter.com/ddo8pEjatx
— H.E. Justin Sun 🍌 (@justinsuntron) November 29, 2024