AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సిద్ధిపేటలో మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో అమరులవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ నిర్వహించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో జరుగుతున్న దీక్షా దివస్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్‌ యాదవ్‌, జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గంగాధర్‌ గౌడ్‌ పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నారు. వరంగల్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ కార్యక్రమం చేపట్టారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌లో దీక్షా దివస్‌ జరుపుకుంటున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి, మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో జిల్లా ఇన్‌చార్జి మన్నెం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో దీక్షా దివస్‌ నిర్వహించారు.

మహబూబాబాద్‌ జిల్లాలో మాజీ మంత్రి రెడ్యానాయక్‌, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తదితరులు దీక్షా దివస్‌లో పాల్గొన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్‌ రెడ్డి, ఇతర నేతలు దీక్షా దివస్‌ నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ భవన్‌ వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ జరుగుతోంది.

మెదక్‌లో నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డిల ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ వేడుకలు జరుగుతున్నాయి. జనగామ జిల్లాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ జరుపుకుంటున్నారు.

 

 

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10