AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌తో మేము కలిస్తే నీకీపాటికి చిప్పకూడే.. కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఫైర్‌

నీ పనికిమాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే మెదడు కూడా లేదనిపిస్తోంది

కాంగ్రెస్‌తో కలిసి పని చేసి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ట్వీట్లు పెట్టకుండా చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు తీవ్ర స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. నీ పనికి మాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదని మెదడు కూడా కోల్పోయావని స్పష్టమవుతుందన్నారు. ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతల భేట్‌ కి సంబంధించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా రాష్ట్ర బీజేపీ నేతలంతా ‘కలిసికట్టుగా’ పని చేయండి’ అనే శీర్షికలతో ఆయా దినపత్రికలలో వచ్చిన కథనాలకు ఎక్స్‌ లో షేర్‌ చేస్తూ కేటీఆర్‌ పోస్టు చేశారు. ‘మోదీ గారు మీ కమలం నేతలు, కాంగ్రెస్‌ నేతలు కలిసిపోయి మరీ కలిసికట్టుగా పని చేస్తున్నా’రంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు ఎక్స్‌ వేదికగా రఘునందన్‌ రావు కౌంటర్‌ ఇస్తూ కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తే కేటీఆర్‌ ఈ పాటికే జైలు పాలు అయ్యేవాడని అన్నారు.

గత పదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు..
గత పదేళ్లు అధికారంలో ఉండి అన్ని శాఖలను, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, విదా వ్యవస్థను, వైద్య వ్యవస్థను కేటీఆర్‌ చిన్నాభిన్నాం చేశారని విమర్శించారు. నీలాంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నేర్చుకునే దౌర్భాగ్యం మాకు పట్టలేదని మండిపడ్డారు. నీకు రాజకీయాలు ఎలా చేయాలో, ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో తెలిసి ఉంటే ఈరోజు అధికారం కోల్పోయి ఉండేవాడివి కాదన్నారు. నిన్ను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన మీ నాయనే ఈరోజు ప్రజలకు ముఖం చూపలేక! ఫాంహౌస్‌ కు పరిమితమైండు, నీ పనికిమాలిని స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు మెదడు కూడా కోల్పోయావని స్పష్టం అవుతుందని ఎద్దేవా చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10