AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 30వ తేదీ నుంచి గురుకుల బాట కార్యక్రమం – కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈనెల 30 తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాసంస్థల తో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను కాలేజీలను పరిశీలిస్తారన్నారు. ఈ గురుకుల బాట కార్యక్రమానికి ఎంఎల్ఏ, ఎమ్మెల్సీ, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులకు సహకారం అందించాలని కేటీఆర్ సూచించారు. బాలికల విద్యాసంస్థల్లో పార్టీ తరఫున విద్యార్థి విభాగం మహిళా నాయకులు, పార్టీ మహిళా నాయకులు సందర్శిస్తారని కేటీఆర్ తెలిపారు. జడ్పీ చైర్మన్లు ఎంపీపీలు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మహిళా సీనియర్ నాయకులు గురుకుల విద్యాసంస్థలను సందర్శించి బాలిక సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని చెప్పారు.

గురుకులాల్లో విద్యార్థులు మరణించడం, విషాహారం కారణంగా విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్న ఘటనలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాలనను గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులకు చావులకు ఈ ముఖ్యమంత్రే కారణమవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్ర వ్యాప్తంగా 48 విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. విద్యాసంస్థల్లో ఉన్న దుర్భరమైన పరిస్థితులను తట్టుకోలేక 23 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని…8 మంది అనుమానాస్పదంగా మృతి చెందారన్నారు. నలుగురు విషాహారం తిని…మరో 13 మంది ఆనారోగ్యంతో చనిపోయారన్నారు. అంతేకాకుండా గత ఏడాది కాలంలో 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని చెప్పారు. 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన హాస్పిటల్ పాలు కాగా…నలుగురు విద్యార్థులు మరణించారన్నారు. వాంకిడి లో విషాహారం తిని శైలజ అనే విద్యార్థిని చనిపోయిన ఘటన మరవకముందే మహబూబ్ నగర్ జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగటం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ANN TOP 10