ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి అద్దె కోసం వచ్చి భార్యాభర్తలను చంపారు దుండగులు. నేలకొండపల్లిలో నివాసం ఉంటున్న ఎర్రా వెంకటరమణ అనే వ్యక్తి ఇంటికి రెంట్ కోసం పది రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇల్లు తమకు నచ్చిందంటూ అడ్వాన్స్‌గా యజమాని డిమాండ్ చేయగా కొంత డబ్బును ముగ్గురు వ్యక్తులు ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత రాత్రి వచ్చిన వారు యజమాని ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళారు. మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో వచ్చి వారు వెంకటరమణను ఆయన భార్య కృష్ణ కుమారికి కళ్ళలో కారం కొట్టి హత్య చేశారు.
తర్వాత ఇంట్లో ఉన్న నగదు, బంగార నగలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. వెళ్లే ముందు ఇంటి చుట్టూ కారం చళ్లారు. రోజూ లాగానే వెంకటరమణ కుమార్తె ఫోన్ చేయగా స్విచ్అప్ వచ్చింది. తల్లిదండ్రులు ఫోన్ లీఫ్ట్ చేయక పోవటంతో అనుమానం వచ్చిన ఆమె హూటహూటిన ఇంట్లోనే అద్దెకు ఉన్నవారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడటంతో తాళం వేసి ఉందటని, ఇంటి చుట్టూ కారం చల్లి ఉన్నదాని చూశారు. వెంటనే ఈ విషయాన్ని కుమార్తెతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. పింగర్ ప్రింట్స్ క్లూస్ టీమ్ అధికారులు సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పరిసరాలను గాలించారు. పక్కనే ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు. కుమారుడు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.