హాజరైన ముఖ్యమంత్రి
తరలివచ్చిన ప్రముఖులు
వధూవరులకు శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం శంషాబాద్ లోని జీఎంఆర్ అరీనా కల్యాణవేదిలో కనులపండువగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి, రజిత దంపతుల కూతురు రుత్విక రెడ్డి, అభిజిత్ రెడ్డిల వివాహ మహోత్సవానికి సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, పలువురు నేతలు హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛాన్ని అందించి, శుభాకాంక్షలు తెలిపి వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు.