AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జార్ఖండ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన భట్టి..

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర ఘోర పరాభవం చవిచూసిన ఇండియా కూటమికి జార్ఖండ్ లో మాత్రం విజయం సాధించింది. జార్ఖండ్ ఎన్నికల్లో కూటమి విజయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పాత్ర వహించారు. ఏఐసీసీకి భట్టికి ఆ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. దీంతో భట్టి తెలంగాణలో పాలన చూసుకుంటూనే.. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు. భట్టి ఈ క్రమంలోనే మూడు సార్లు జార్ఖండ్ వెళ్లారు.

అక్కడి ఎన్నగల కోసం వారం రోజుల పాటు పని చేశారు. భట్టి ప్రణాళికలు కూడా ఇండియా కూటమి విజయానికి దోహదపడ్డాయని నిపుణులు చెబుతున్నారు. జార్ఖండ్ లో ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ లో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఒక్కరే ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారం నిర్వహించారు. భట్టి విక్రమార్క జార్ఖండ్ కోసం హార్డ్ వర్క్ చేసినట్లు చెబుతున్నారు.

ఇండియా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన భట్టికి ఏఐసీసీ పెద్దలు శుభాకాంక్షలు చెప్పారు. భట్టి జార్ఖండ్ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణతోపాటు స్థానిక మైనింగ్, ఇతర వనరులు స్థానికులకే దక్కాలి అని ప్రచారం చేశారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లినట్లు నిపుణులు చెబుతున్నారు. భట్టి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్ జేడీ మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో కీలక వ్యవహరించారు. ప్రశాంతంగా సీట్లు సర్దుబాటు జరిగేలా చూశారు. మేనిఫెస్టోపై అక్కడి నాయకులకు భట్టి దిశనిర్దేశం చేశారు.

జార్ఖండ్ ఇండియా కూటమి విజయం ఖాయమైందన్న నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులుగా ఉన్న భట్టి హుటాహుటిన జార్ఖండ్ వెళ్లారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో జార్ఖండ్ చేరుకున్నారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ నేతలతో మాట్లాడారు. ముక్తి మోర్చా నేత, సీఎం సోరేన్ ఇంటికి కీలక నేతలతో కలిసి మాట్లాడారు. ఆదివారం గెలుపొందిన ఎమ్మెల్యేలతో ఇండియా కూటమి నేతలు సమావేశం అవుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10