జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి బంపర్ విక్టరీ సాధించింది. దీంతో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. శనివారం ఉదయం జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి గులాం అహ్మద్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు జార్ఖండ్ కు పరిశీలకులుగా ఏఐసీసీ నియమించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తారిఖ్ అన్వర్, కృష్ణ అల్లవూరితో పాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ రాజేష్ ఠాకూర్ హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. కాగా జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈసీ గణాంకాల ప్రకారం ఇండియా కూటమి 57, ఎన్డీయే కూటమి 23 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతరులు ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నారు.
