ఈ నెల 25 నుంచి జరగనున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(Railway Recruitment Board) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం తెలియజేశారు.
24, 25, 26, 28, 29వ తేదీల్లో గుంటూరు- సికింద్రాబాద్(07101), 24, 25, 26, 28 తేదీల్లో సికింద్రాబాద్- గుంటూరు(07102), కరీంనగర్- కాచిగూడ (07103), కాచిగూడ- కరీంనగర్ (07104), 23న నాందేడ్- తిరుపతి(Nanded-Tirupati) (07105) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
అలాగే.. 24న తిరుపతి- నాందేడ్ (07106), 24, 26, 28, 29 తేదీల్లో కాకినాడ టౌన్- తిరుపతి (07107), తిరుపతి- కాకినాడ టౌన్ (07108) 24, 25, 26 తేదీల్లో కాచిగూడ- కర్నూల్ సిటీ (07109), కర్నూల్ సిటీ- కాచిగూడ (07110), 24, 25, 26, 27 తేదీల్లో హుబ్లీ- కర్నూల్ సిటీ (07315), 25, 26, 27, 28 తేదీల్లో కర్నూల్ సిటీ- హుబ్లీ (07316) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.