ముఖ్య అతిథిగా హాజరైన కంది శ్రీనివాస రెడ్డి
జైనథ్ లో కొలువైన లక్ష్మీ నారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.బుధవారం సాయంత్రం జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు . ఆయన భక్తులకు అభివాదం చేస్తూ రథం ముందు నడిచారు.డప్పచప్పుళ్లు, భక్తుల భజనలు, కోలాటాలు ,కత్తి సాము విన్యాసాల మధ్య స్వామి వారు అందంగా అలంకరించిన రథం పై గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగారు.
దారి పొడవునా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రధం వెంట నడిచారు.వీధుల్లోని డాబాలపై నుండి భక్తులు స్వామి వారిపై పూల వర్షం కురిపించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు, గ్రామస్తుల నడుమ ఈ రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి డప్పుకొట్టి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి , వైస్ చైర్మన్ విలాస్ , డైరక్టర్లు , ఆలయ కమిటీ చైర్మన్ రుకేష్ రెడ్డి , పాలక వర్గ సభ్యులు , స్థానిక కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు, గ్రామస్తులు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు.