AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేపై కేసు .. భూ కబ్జా వివాదంలో శంకర్‌ నాయక్‌

బాధితుల నుంచి ఫిర్యాదుల వెల్లువ
న్యాయం చేయాలంటూ వేడుకోలు

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ కబ్జా వివాదంలో శంకర్‌ నాయక్‌ ఇరుక్కున్నారు. ఆయనపై హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. నగరంలోని హంటర్‌ రోడ్డు వినాయక నగర్‌ రోడ్డు–1 దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని ఆక్రమణకు మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థల యజమానులకు చెందిన కంటైనర్‌తో పాటు గృçహోæపకరణ వస్తువులను దొంగలించిన విషయంలోనూ శంకర్‌ నాయక్‌పై పలు సెక్షన్‌ లలో కేసు నమోదైంది. బాధితులపై దాడి చేసి, సెల్‌ ఫోన్లు లాక్కున్నారని శంకర్‌ నాయక్‌పై ఆరోపణలు వచ్చాయి. వీటిపై పోలీసులు దృష్టి సారించారు. బాధితులు వరుసగా ఫిర్యాదు చేస్తుండటంతో పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు వేడుకుంటున్నారు.

గతంలోనూ కేసు నమోదు..
కాగా గతంలో శంకర్‌ నాయక్‌పై 2017లో మహబూబాబాద్‌లో కేసు నమోదైంది. అప్పటి కలెక్టర్‌ ప్రీతిమీనాతో అనుచితంగా ప్రవర్తించారన్న కేసును కోర్టు కొట్టివేసింది. శంకర్‌నాయక్‌పై అభియోగాలు రుజువు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వీగిపోయింది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ నేతలపై ఫోన్‌ ట్యాపింగ్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో భూ కబ్జా వివాదంలో మరో బీఆర్‌ఎస్‌ నేత చిక్కుకోవడంతో రేవంత్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10