AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘పుష్ప’ ఎప్పుడూ తగ్గడు.. పట్నాలో పుష్ప-2 ట్రైలర్‌ విడుదల

‘‘పుష్ప’ ఎప్పుడూ తగ్గడు కానీ మీ ప్రేమ కోసం తగ్గుతాడు’’ అంటూఅభిమానుల్లోఉత్సాహం నింపారు అల్లు అర్జున్‌.దేశం మొత్తం తనపై చూపిస్తున్న అభిమానానికి పట్నా వేదికగా జరిగిన పుష్ప-2’ (Pushpa 2)ట్రైలర్‌ ఆవిష్కరణలో అభిమానులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు  . ఆయన హీరోగా నటించిన పుష్ప-2’ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది.

ఆదివారం పట్నాలో ఈ చిత్రం ట్రైలర్‌ను వేలాది మంది అభిమానుల నడుమ విడుదల చేశారు. బీహార్ గవర్నమెంట్ 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ట్రైలర్ లాంచ్ కి ఇవ్వటం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. దాదాపు ఈ ఈవెంటుకి 25000 మంది ఫ్యాన్స్ హాజరయ్యారని తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ “నా హిందీ కాస్త మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. నన్ను క్షమించగలరు. ఎప్పుడు పట్నా వచ్చినా మీరు చూపించే ప్రేమ, ఇచ్చే ఘన స్వాగతానికి  ఈ ప్రాంత అభిమానులు అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమంతా ఇక్కడ కనబడుతుంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఇక నుండి  వైల్డ్‌ ఫైర్‌’ అంటూ డైలాగ్‌ చెబుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమాని గత మూడు సంవత్సరాలుగా మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ సినిమాగా నిలిపినందుకు థ్యాంక్యూ. ఇది నా గొప్పతనం కాదు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. అందుకు పుష్ప టీమ్‌  మొత్తానికి నా  ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. స్పాన్సర్స్‌కి, పోలీస్‌ సిబ్బందికి, ఫ్యాన్స్‌కు మరీ మరీ థ్యాంక్యూ’’ అని అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ “ఇంతటి ప్రేమను అందించిన పట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు.  ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల  మీ ఎదురుచూపులకు  కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుందని  చెప్పగలను. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ సేన సాహెబ్‌ మాట్లాడుతూ “పుష్ప 2’ ట్రైలర్‌ను పట్నాలో విడుదల చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. బీహార్‌ ప్రభుత్వం తరఫున అలాగే ముఖ్యమంత్రి గారి తరపున చిత్ర బృందానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి తోడ్పడిన పోలీసులకు, అభిమానులు అందరూ కళను, కళాకారులను సపోర్ట్‌ చేసేవారు కావడం సంతోషంగా ఉంది. మా రాష్ర్టానికి అతిథిగా వచ్చినప్పుడు వారికి మా ప్రేమానురాగాలు చూపించడంలో ముందుంటాము. ఈ చిత్ర బృందానికి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు అందరికీ నా ధన్యవాదాలు’’ అని అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10