AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మొదటి ముద్దాయి కేటీఆరే.. లగచర్ల ఘటనలో ప్రధాన సూత్రధారి ఆయనే..

శిక్ష అనుభవించాల్సిందే..

టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఫైర్‌

లగచర్ల దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సీరియస్‌ అయ్యారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. లగచర్ల దాడి వెనుక పెద్ద కుట్రకోణం దాగి ఉందన్నారు. ఈ ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్‌ అని అన్నారు. కలెక్టర్‌ పై దాడి చేసినవారు ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. కేటీఆర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వెళ్ళగానే పట్నం నరేందర్‌ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించారని మహేశ్‌ మండిపడ్డారు.

తప్పుపట్టడమే పనిగా..
ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను తప్పపట్టడమే పనిగా బీఆర్‌ఎస్, బీజేపీల వ్యవహారం ఉందని అన్నారు. హైడ్రా తప్పు అన్నారు. మూసీ పునరుజ్జీవం తప్పు అన్నారు. ఇప్పుడు లగచర్ల ఫార్మా విషయంలోనూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. లగచర్ల దాడి వెనుకు కుట్ర ఉందని అన్నారు. ఈ విషయాన్ని అంత సులువగా వదిలిపెట్టబోమని.. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ ఫార్ములా విషయంలో కేటీఆర్‌ డబ్బులు నొక్కేసారని అన్నారు. ప్రభుత్వ డబ్బులు కాజేసినా ఊరుకోవాలా? అని పీసీసీ చీఫ్‌ ప్రశ్నించారు. ఎవరి జాగీరు డబ్బులు అని ఇష్ట రాజ్యంగా వాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూములు లేని వారు సైతం..
రైతులు కానీ వారు, భూములు లేని వారు సైతం దాడి చేయాల్సిన అవసరం ఏముందని పీసీసీ చీఫ్‌ ప్రశ్నించారు. రాజకీయాల కోసం చిల్లర వేషాలు వేస్తున్నారన్నారు. అధికారులపై దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అభివృద్ధి ఆగిపోతే తరతరాలు బాధపడాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. ఈ నెల 16 నుంచి జిల్లాల పర్యటనకి వెళ్తున్నామని మొదట కరీంనగర్‌ నుంచి ప్రారంభిస్తామని మహేశ్‌కుమార్‌ తెలిపారు.

ANN TOP 10