టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఈ కేసులో కీలక అడుగు వేశారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం క్రింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు హైదరాబాద్లోని వర్మ నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ నెల 19వతేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
రాం గోపాల్ వర్మపై కేసు నమోదు అయితే రాంగోపాల్ వర్మ పైన మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చెయ్యగా, ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా టిడిపి అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం, నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పైన, లోకేష్, నారా బ్రాహ్మణి పైన వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
టీడీపీ నేత ఫిర్యాదుతో ఐటీ చట్టం కింద కేసు నమోదు ఆర్జీవీ చేసిన అనుచిత పోస్టులపైన మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కాగా గతంలో వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాంగోపాల్ వర్మ చంద్రబాబును పదేపదే టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ఏకంగా చంద్రబాబును నెగిటివ్ క్యారెక్టర్ గా తన సినిమాలలో చూపిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును పదేపదే టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేష్ ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టిన వైసిపి కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న వారిపైన కేసులు పెడుతున్నారు.